ఇవి కూడా హైబీపీ లక్షణాలే మనదేశంలో కూడా హైబీపీ ప్రధాన సమస్యగా మారింది. ధమనుల్లోని రక్తం అధికవేగంతో ప్రవహిస్తూ ధమని గోడలను ఢీ కొట్టినప్పుడు ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. చిన్న చిన్న లక్షణాల ద్వారా ఇది ఉందేమోనని అనుమానించవచ్చు. ఉదయాన నిద్ర లేచిన తరువాత కొందరిలో తలనొప్పి వస్తుంది. ముక్కు నుంచి ఒక్కోసారి కాస్త రక్తస్రావం కనిపించవచ్చు. శ్వాస తీసుకోవడంలో తరచూ ఇబ్బందిగా అనిపిస్తుంది. గుండెకొట్టుకునే వేగంలో తేడా వస్తుంది. మూత్రంలో రక్తం కనిపించడం ఈ లక్షణాలు తరచూ వేధిస్తుంటే వెంటనే వైద్యుని వద్దకు వెళ్లండి.