గర్భంతో ఉన్నప్పుడు ఈ మందులు వాడొద్దు



గర్భం ధరించాక తినే ఆహారం నుంచి మందుల వరకు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.



నచ్చినట్టు పెయిన్ కిల్లర్స్ వాడడం చాలా ప్రమాదకరం.



బ్రిటన్‌కు చెందిన అబెర్డీన్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు ఈ అంశంపై భారీ పరిశోధన నిర్వహించారు.



దాని ప్రకారం గర్భం ధరించిన సమయంలో అధికంగా పారాసెటమాల్, ఐబూఫ్రూఫెన్ వంటి మందులు వాడిన తల్లుల్లో ప్రసవం కష్టతరంగా మారినట్టు గుర్తించారు.



కొందరికి పుట్టిన బిడ్డ చనిపోవడం లేదా, గర్భంలోనే మరణించడం వంటి కేసులు కూడా బయటపడ్డాయి.



మరికొందరిలో నెలలు నిండకుండానే బిడ్డ పుట్టిన సందర్భాలనూ గుర్తించారు.



అందుకే గర్భం ధరించిన సమయంలో పారాసెటమాల్, ఐబూ ప్రూఫెన్ మందులను అధికంగా వాడకూడదని సూచిస్తున్నారు.



ఆస్పిరిన్, నాన్ స్టెరాయిడ్ యాంటి ఇన్ ఫ్లమ్మేటరీ డ్రగ్స్, డైక్లోఫెనాక్, న్యాప్రోక్సెన్ వంటి సమ్మేళనాలు కలిగినవి కూడా ప్రసూతి సమయంలో వినియోగించకూడదని సూచిస్తున్నారు పరిశోధకులు.



గర్భధారణ సమయంలో పారాసెటమాల్, ఇబుప్రోఫెన్ వంటి పెయిన్ కిల్లర్లు తీసుకున్న తల్లులలో 37 వారాల కంటే ముందుగా ప్రసవం అయ్యే అవకాశం 50 శాతం ఉండగా, ప్రసవసమయంలో బిడ్డ చనిపోయే అవకాశం 33 శాతంగా ఉంది.