అనసూయ యాంకరింగ్‌తోపాటు సినిమాల్లోనూ బిజీగా ఉంది. అనసూయ ‘పుష్ప-2’ ‘దర్జా’, ‘సింబ’, ‘రంగమార్తండ’, ‘పండుగాడ్’, ‘పక్కా కమర్షియల్’ సినిమాల్లో నటిస్తోంది. ‘ఖిలాడీ’ గ్లామర్ పాత్రతో ఔరా అనిపించింది అనసూయ. భిన్న పాత్రలను ఎంచుకుంటూ అనసూయ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. బుల్లితెరపై ‘జబర్దస్త్’, ‘సూపర్ సింగర్ జూనియర్’ షోలకు అనసూయ యాంకరింగ్ చేస్తోంది. అంత బిజీ షెడ్యూల్‌లో కూడా అనసూయ తన ఫ్యామిలీకి సమయం కేటాయిస్తోంది. మే 15న అనసూయ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన ఫ్యామిలీతో హ్యాపీగా గడిపింది. పుట్టిన రోజు సందర్భంగా ఆమె తన కుటుంబ సభ్యులతో జంగిల్ ట్రిప్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా తనకు ‘జుమాంజీ’లో ఉన్న ఫీలింగ్ కలుగుతోందని అనసూయ పేర్కొంది. Images and Videos: Anasuya Bhardwaj/Instagram