పార్ట్ 2 - యక్ష ప్రశ్నలు



7. మానవునికి సహాయపడేది ఏది?
Ans: ధైర్యం
8. మానవుడు దేనివలన బుద్ధిమంతులవుతారు?
Ans: పెద్దలను సేవించడం



10. మానవునికి సాధుత్వం ఎలా వస్తుంది?
Ans: తపస్సు వలన
11. మానవుడు మనిషి ఎలా అవుతాడు?
Ans: మృత్యు భయము వలన



12.బతికి ఉండే చిచ్చినవాడితో సమానం ఎవరు ?
Ans: దేవతలకూ, అతిథులకు, పితృదేవతలకు పెట్టకుండా తినేవాడు
13. భూమికంటె భారమైనది ఏది?
Ans: తల్లి



14. ఆకాశంకంటే పొడవైనది ఎవరు?
Ans: తండ్రి
15 . గాలికంటె వేగమైనది ఏది?
Ans: మనస్సు



16. మానవుడికి సజ్జనత్వం ఎలావస్తుంది?
Ans: ఇతరులు తనపట్ల ఏపని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల అలా ప్రర్తించకుండా ఉండాలి



17. తృణం కంటే దట్టమైనది ఏది?
Ans: చింత
18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది?
Ans: చేప



19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు?
Ans: అస్త్ర విద్యతో
20. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది?
Ans: యజ్ఞం చేయుటం వలన



21. జన్మించియున్నా ప్రాణంలేనిది?
Ans: గుడ్డు
22. రూపం ఉన్నా హృదయం లేనిదేది?
Ans: రాయి



23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది?
Ans: అడిగిన వాడికి సాయం చేయకపోవడం



24. ఎల్లప్పుడూ వేగం గలదేది?
Ans: నది
25. రైతుకి ముఖ్యమైనది ఏది?
Ans: వాన