ఏప్రిల్‌లో థియేటర్లలో సందడి చేయనున్న తెలుగు సినిమాలు ఏవో తెలుసా? ఏప్రిల్ 1న తాప్సి 'మిషన్ ఇంపాజిబుల్' ఏప్రిల్ 8న వరుణ్ తేజ్ 'గని' ఏప్రిల్ 14న విజయ్ 'బీస్ట్'. తమిళ్ స్టార్ విజయ్ నటించిన ఈ సినిమా తెలుగులోనూ విడుదల కానుంది. ఏప్రిల్ 14న యశ్ 'కె.జి.యఫ్ 2'. ఇదీ పాన్ ఇండియా రిలీజ్. యాంకర్ సుమ ప్రధాన పాత్రలో నటించిన 'జయమ్మ పంచాయతీ' ఏప్రిల్ 22న విడుదల కానుంది. నాగశౌర్య, షెర్లియా సేథీ జంటగా నటించిన 'కృష్ణ వ్రింద విహారి' విడుదల ఏప్రిల్ 22న 'అశోక వనంలో అర్జున కళ్యాణం'తో విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ కూడా ఏప్రిల్ 22న వస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ నటించిన 'ఆచార్య' ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.