కాలు విరగ్గొట్టుకున్న నవదీప్- కామెడీ చేసిన తేజస్వి తేజస్వి మదివాడ, నవదీప్ ‘ఐస్ క్రీమ్’ సినిమాలో కలిసి నటించారు. అప్పటి నుంచీ వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. నిత్యం ఒకరిపై మరొకరు పంచులు, సెటైర్లు వేసుకుంటూ ఉంటారు. తాజాగా నవదీప్‌ను ఆటపట్టిస్తూ తేజస్వి ఒక వీడియో షేర్ చేసింది. కాలి గాయంతో ఇబ్బంది పడుతున్న నవదీప్ ముందు ‘నీ సుఖమే నే కోరుకున్నా’ అంటూ గెంతులు వేసింది. ప్రస్తుతం తేజస్వి-నవదీప్ ఫన్నీ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. Photos & Video Credit: Tejaswi Madivada/Instagram