ప్రపంచవ్యాప్తంగా సమాచార మార్పిడికి యూట్యూబ్ అతిపెద్ద వేదిక అయినప్పటికీ కొన్ని దేశాలు నిషేధించాయి.

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

2009 నుండి చైనాలో యూట్యూబ్ పూర్తిగా నిషేధించారు. దానికి బదులుగా యూకు అనే చైనా ప్లాట్‌ఫారమ్‌లను వారు ప్రోత్సహిస్తున్నారు.

Image Source: pexels

ఉత్తర కొరియాలో 2016 ఏప్రిల్‌లో అధికారికంగా యూట్యూబ్‌ను నిషేధించారు. ఎవరైనా వాడితే కఠినమైన శిక్షలు విధిస్తారు.

Image Source: pexels

2009 అధ్యక్ష ఎన్నికల సమయంలో జరిగిన నిరసనల తర్వాత ఇరాన్ ప్రభుత్వం యూట్యూబ్‌ను శాశ్వతంగా బ్లాక్ చేసింది.

Image Source: pexels

తుర్క్మెనిస్తాన్ లో భద్రతా కారణాల దృష్ట్యా 2009 నుండి ఇక్కడ యూట్యూబ్ అందుబాటులో లేదు.

Image Source: pexels

ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాలో యూట్యూబ్ సేవలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

Image Source: pexels

ఎరిట్రియా దేశంలో ప్రభుత్వం యూట్యూబ్‌ను బ్లాక్ చేసి ఉంచుతుంది.

Image Source: pexels

సిరియా అంతర్యుద్ధం , రాజకీయ అస్థిరత కారణంగా సిరియాలో యూట్యూబ్‌పై సుదీర్ఘకాలం పాటు నిషేధం కొనసాగింది.

Image Source: pexels

వివాదాస్పద వీడియోల కారణంగా పాకిస్థాన్ 2012 నుండి 2016 వరకు యూట్యూబ్‌ను పూర్తిగా నిషేధించింది.

Image Source: pexels

ఆస్ట్రేలియా ఇటీవల 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం యూట్యూబ్‌ను నిషేధించింది.

Image Source: pexels