కొత్త జీమెయిల్ యూజర్ పేరు కావాలా?

ఇదిగోండి, సరికొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి

Published by: Shankar Dukanam
Image Source: X.com

గూగుల్ తన పాత లేదా ఇబ్బందికరమైన Gmail యూజర్ నేమ్ లను కొత్త ఖాతా క్రియేట్ చేయకుండానే మార్చుకునేలా ఒక ఫీచర్ ను ప్రారంభించనుంది

Image Source: X.com

గూగుల్ ఒక పేజీలో ప్రకటించింది. వినియోగదారులు తమ ఈమెయిల్ అడ్రస్‌ను @gmail.comతో మార్చుకునేలా ఒక కొత్త విధానాన్ని తీసుకురావాలని చూస్తోంది.

Image Source: X.com

ఇంతవరకు ఈ ఫీచర్ కేవలం థర్డ్ పార్టీ ఈమెయిల్‌తో గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసిన వారికి మాత్రమే అందుబాటులో ఉంది. డైరెక్టుగా జిమెయిల్ అడ్రస్ ఉన్న వినియోగదారులకు ఇది సాధ్యం కాలేదు.

Image Source: Pixabay

కొత్త ఈమెయిల్ అడ్రస్ ఎంచుకున్న తర్వాత, గూగుల్ మీ పాత Gmail మారుపేరుగా ఉపయోగించవచ్చు.

Image Source: X.com

మీరు మీ పాత, కొత్త ఇమెయిల్ అడ్రస్‌లతో Google సేవలకు లాగిన్ అవ్వొచ్చు. పాత ఈమెయిల్‌కు వచ్చే మెస్సేజ్, ఫోటోలు, చాట్‌లు, ఇతర డేటా పూర్తిగా సురక్షితంగా ఉంటాయి

Image Source: X.com

గూగుల్ ఈ ఫీచర్‌తో కొన్ని రూల్స్ అమలు చేస్తుంది. యూజర్లు కొత్త జీమెయిల్ అడ్రస్ సెలక్ట్ చేసుకున్నాక ఒక ఏడాది పాటు కొత్త జీమెయిల్ అకైంట్ క్రియేట్ చేసుకోలేరు.

Image Source: X.com

ఈయిల్ చిరునామాను మార్చుకునే సదుపాయం లిమిటెడ్ చేశారు. గరిష్టంగా మూడు సార్లు ఈ పీచర్ ఉపయోగించవచ్చు.

Image Source: Pixabay

ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రాలేదు. గూగుల్ ప్రకారం Gmail యూజర్ నేమ్స్ మార్చుకోవడం త్వరలోనే అందుబాటులోకి వస్తోంది.

Image Source: Pixabay

కొంతమంది వినియోగదారులు ఈ ఆప్షన్ వెంటనే చూడకపోవచ్చు. కొంచెం వేచి ఉండాల్సి ఉంటుంది. Gmail యూజర్ నేమ్ క్రియేట్ చేసినట్లు అయితే త్వరలోనే వారికి రిలీఫ్ దొరకనుంది

Image Source: Unsplash

2026లోనే ఈ ఫీచర్ ఎక్కువ మందికి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. Gmail ఎక్స్‌పీరియన్స్ మరింత సౌకర్యవంతంగా, సులభంగా మారుతుంది.

Image Source: Unsplash