కొంత ఇళ్లలో ఏసీని వర్షాకాలం కూడా వాడటం తప్పనిసరి అవుతుంది.

అయితే సమ్మర్‌లో వాడినట్లుగా వర్షాకాలంలోనూ ఏసీ వాడకూడదు.

ఏసీ వాడితే గది చల్లగా ఉంటుంది కానీ తేమ ఉంటుంది, విద్యుత్ వినియోగం పెరుగుతుంది

వర్షాకాలంలో మీ ఏసీని పూర్తిగా ఉపయోగించుకోవాలనుకుంటే ఒక ప్రత్యేక మోడ్ సహాయపడుతుంది

వర్షాకాలంలో గాలిలో తేమ శాతం గణనీయంగా పెరుగుతుంది

ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా లేనప్పుడు కూడా వాతావరణంలో అధిక తేమ శరీరాన్ని అసౌకర్యంగా చేస్తుంది

చెమట త్వరగా ఆరిపోదు , గది జిగటగా మారుతుంది అందుకే కొన్నిసార్లు 28 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా వేడిని ఫీల్ అవుతారు.

వర్షాకాలంలో డ్రై మోడ్ ఏసీకి అత్యంత ఉపయోగకరమైన మోడ్‌

డ్రైమోడ్‌లో పెడితే గదిలోని గాలి నుండి అదనపు తేమను తొలగిస్తుంది. డ్రై మోడ్‌ను ఆన్ చేసినప్పుడు AC కంప్రెసర్ నిరంతరం నడవదు

డ్రై మోడ్ అతిపెద్ద ప్రయోజనం అధిక శీతలీకరణ లేకుండా సౌకర్యవంతంగా అనిపిస్తుంది

మరొక పెద్ద ప్రయోజనం కరెంట్ ఆదా ఎందుకంటే ఈ మోడ్‌లో ACకి నిరంతరం పనిచేయాల్సిన అవసరం లేదు

బయటి ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటే , తేమ తక్కువగా ఉంటే డ్రై మోడ్ అంత ప్రభావవంతంగా ఉండదు