రియల్‌మీ జీటీ 7 ప్రో వచ్చేసింది - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయి? ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త ప్రీమియం ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. అదే రియల్‌మీ జీటీ 7 ప్రో. ఈ ఫోన్ ప్రస్తుతం చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులో 6.78 అంగుళాల 2కే ఎకో2 స్కై స్క్రీన్ డిస్‌ప్లేను కంపెనీ అందించింది. దీని ధర చైనాలో 3,699 యువాన్ల (సుమారు రూ.43,800) నుంచి ప్రారంభం కానుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ లేటెస్ట్ 8 ఎలైట్ ప్రాసెసర్‌పై రియల్‌మీ జీటీ 7 ప్రో రన్ కానుంది. ఈ ఫోన్‌లో 16 జీబీ వరకు ర్యామ్, 1 టీబీ వరకు స్టోరేజ్ అందుబాటులో ఉంది. ఇందులో ఫోన్ వెనకవైపు 50 + 8 + 50 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మీ యూఐ 6.0 ఆపరేటింగ్ సిస్టంపై రియల్‌మీ జీటీ 7 ప్రో రన్ కానుంది. రియల్‌మీ జీటీ 7 ప్రో నవంబర్ 26న మనదేశంలో లాంచ్ కానుంది.