వృషభ రాశి వార ఫలాలు ( డిసెంబరు 10 - 16) ఈ వారం వృషభ రాశివారికి ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. మీ ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. సంతానానికి సంబంధించిన ఆందోళనలు కొంత ఇబ్బంది పెడతాయి. ఉద్యోగం చేసే మహిళలకు ఇల్లు-కార్యాలయ వ్యవహారాలను బ్యాలెన్స్ చేసుకోవడం కష్టం అవుతుంది. వారం మధ్యలో ఎలాంటి వివాదాలు రాకుండా జాగ్రత్తగా ఉండండి. మీరు ఆస్తి వివాదంలో చిక్కుకున్నట్లయితే కోర్టుకు వెళ్లే బదులు చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికే మొగ్గుచూపండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ప్రయాణ సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. విద్యార్థులు వారాంతంలో తమ చదువులపై దృష్టి సారిస్తారు కానీ విజయానికి అదనపు శ్రమ అవసరం కావచ్చు. మీరు మీ ప్రేమను ఎవరికైనా తెలియజేయాలని ఆలోచిస్తుంటే తొందరపడొద్దు..అనుకూల సమయం కోసం వేచి ఉండండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించిన ఆందోళనలు ఉంటుంది. Images Credit: Pixabay