మేష రాశి వార ఫలాలు ( డిసెంబరు 10 - 16) ఈ వారంలో పనులు పూర్తి చేయడానికి, మీరు అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు కొంత ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. మేషరాసివారు మీ కెరీర్ లేదా వ్యాపారానికి సంబంధించిన కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. స్నేహితులు మరియు బంధువుల నుంచి ఆశించిన మద్దతు లేకపోవడంతో నిరాశ చెందుతారు కానీ వారం మధ్యలో సానుకూల ఫలితాలొస్తాయి వ్యాపారస్తులు ఆర్థిక లావాదేవీలు వ్యాపార ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వర్నీ గుడ్డిగా నమ్మేయవద్దు. నిరుద్యోగులు ఈ వారం గుడ్ న్యూస్ వింటారు. ఉద్యోగులు నిన్నటి వరకూ ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతారు. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో ఆర్థిక లాభాలుంటాయి. ప్రేమ జీవితం, వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఆహారం, ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. Images Credit: Pixabay