ఈ రాశివారిది చంచల స్వభావం కొన్ని రాశులవారు సీక్రెట్ మెంటైన్ చేయలేరు. చెప్పేయాలని చెప్పేయరు కానీ వాళ్లకి తెలియకుండానే అలా జరిగిపోతుందంతే సీక్రెట్ మెంటైన్ చేయలేని ఐదు రాశుల్లో కర్కాటక రాశి ఒకటి కర్కాటక రాశివారిది చంచల స్వభావం. ఎప్పుడెలా ఉంటారో తెలియదు. మనసులో ఉన్నది ఉన్నట్టు బయటకు చెప్పేస్తారు. ఈ విషయం చెప్పొచ్చు చెప్పకూడదు అని ఆలోచించరు. అంతా జరిగాక మాత్రం తలుచుకుని ఒంటరిగా కూర్చుని బాధపడతారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అందుకే కర్కాటక రాశివారితో ముఖ్యమైన విషయాలు చెప్పకపోవడమే మంచిది