భారతదేశంలో ఎక్కువగా అమ్ముడుపోతున్న కార్లలో టాటా నెక్సాన్ మొదటి స్థానంలో ఉంది. 2023 డిసెంబర్‌లో టాటా నెక్సాన్ 15,284 యూనిట్లు అమ్ముడుపోయాయి. 2022 డిసెంబర్‌తో పోలిస్తే టాటా నెక్సాన్ సేల్స్ ఏకంగా 26.81 శాతం పెరిగాయి. టాటా నెక్సాన్ ఈవీ తక్కువ సమయంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కారుగా మారింది. కొత్త కస్టమర్లకు ఇది ఫేవరెట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. కేవలం మూడు సంవత్సరాల స్వల్ప వ్యవధిలోనే టాటా నెక్సాన్ ఈవీ 50,000 యూనిట్ల అమ్మకాల మార్కును దాటింది. మనదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. మొత్తమ్మీద నెక్సాన్, దాని వేరియంట్‌లు అన్నీ కలిపి దేశీయ మార్కెట్‌లో 15 శాతం అమ్మకాలను సొంతం చేసుకున్నాయి.