ఇప్పుడు కొత్త బైకుల్లో ఇంజిన్ స్టార్ట్ చేయగానే హెడ్ లైట్స్ కూడా ఆన్ అయిపోతున్నాయి. వాటిని ఆఫ్ చేయడానికి ఎటువంటి స్విచ్ ఇవ్వడం లేదు. కానీ ఇంతకు ముందు ద్విచక్రవాహనాల్లో అలా ఉండేది కాదు. 2017 ఏప్రిల్ 1వ తేదీ తర్వాత ఈ నియమం అమల్లోకి వచ్చింది. లైట్‌ను హైబీమ్, లో బీమ్‌కు మార్చుకునే ఆప్షన్ ఉంది. రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న కారణంగా ప్రభుత్వం ఈ నియమాన్ని తీసుకువచ్చింది. దీన్ని ఆటోమేటిక్ హెడ్‌లైట్ ఆన్ ఫీచర్ అంటారు. రోడ్డు మీద చిన్న వాహనాలు కనబడటం చాలా తక్కువగా ఉంటుంది. చలికాలంలో పొగ మంచు ఎక్కువగా ఉన్నప్పుడు చిన్న వాహనాలు ఎక్కువగా కనబడవు. బైక్ హెడ్ లైట్ ఆన్‌లో ఉంటే మీ బైక్ ఎదురుగా వచ్చే వారికి కనిపిస్తుంది.