ఎల్లో ప్లేట్ మీద నలుపు రంగులో నంబర్ ఉంటే అది రవాణా కోసం వాడే వాహనం.

తెల్ల ప్లేట్ మీద నలుపు రంగులో నంబర్ ఉంటే అది ప్రైవేటు వాహనం.

బ్లూ ప్లేట్ మీద తెల్ల రంగులో నంబర్ ఉంటే అది దౌత్యవేత్తలు ఉపయోగించే వాహనం.

గ్రీన్ ప్లేట్ మీద తెల్ల రంగులో నంబర్ ఉంటే అది ఎలక్ట్రిక్ వాహనం.

ముదురు ఆకుపచ్చ లేదా నల్ల ప్లేట్ మీద తెల్ల రంగులో నంబర్ ఉంటే అది మిలటరీ అధికారి ఉపయోగించే అఫీషియల్ వాహనం.

రెడ్ నంబర్ ప్లేట్ మీద భారతదేశ లోగో ఉంటే అది ప్రెసిడెంట్/గవర్నర్ ఉపయోగించే అధికారిక వాహనం.

నల్ల ప్లేట్ మీద పసుపు రంగులో నంబర్ ఉంటే అది రెంటల్ వాహనం.

ఎల్లో ప్లేట్ మీద ఎరుపు రంగులో నంబర్ ఉంటే అది టెంపరరీ రిజిస్టర్ నంబర్.

రెడ్ ప్లేట్ మీద తెలుపు రంగులో నంబర్ ఉంటే అది వ్యాపారం కోసం ఉపయోగించే వాహనం.