దేశంలో లీడింగ్ కార్ల తయారీ సంస్థ టాటా తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. తన కార్ల ధరలను కంపెనీ పెంచింది. అన్ని పాసింజర్ వాహనాల ధరలను 0.7 శాతం మేర పెంచింది. అయితే పెరిగిన ధరలను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. ఇన్‌పుట్ కాస్ట్ పెరగడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. కంపెనీ ఇటీవలే టాటా పంచ్ ఈవీని మార్కెట్లో లాంచ్ చేసింది. మారుతి సుజుకి కూడా జనవరి 16వ తేదీ నుంచి కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది.