ఎయిర్ ప్యూరిఫయర్ ఉన్న టాటా నెక్సాన్ ధర రూ.12.5 లక్షలుగా ఉంది. ఇదే ఫీచర్ ఉన్న ఎంజీ హెక్టార్ ధర రూ.19.44 లక్షలుగా నిర్ణయించారు. కియా సోనెట్‌లో ఈ ఫీచర్ ఉంది. దీని ధర రూ.12.75 లక్షలుగా ఉంది. ఎయిర్ ప్యూరిఫయర్ ఉన్న కియా సెల్టోస్ ధర రూ.15.17 లక్షలుగా నిర్ణయించారు. కియా కేరెన్స్‌లో కూడా ఎయిర్ ప్యూరిఫయర్ ఉన్న మోడల్స్ ఉన్నాయి. దీని ధర రూ.16.35 లక్షలుగా ఉంది. ఎయిర్ ప్యూరిఫయర్ ఉన్న హ్యుందాయ్ వెర్నా వేరియంట్ రూ.14.66 లక్షలుగా ఉంది. ఇదే ఫీచర్ ఉన్న హ్యుందాయ్ వెన్యూని రూ.12.44 లక్షలుగా నిర్ణయించారు. హ్యుందాయ్ క్రెటాలో ఎయిర్ ప్యూరిఫయర్ ఉన్న వేరియంట్ ధర రూ.14.81 లక్షలుగా నిర్ణయించారు.