టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు రెండో విజయం లభించింది.

ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 42 పరుగులతో ఘనవిజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.

అనంతరం ఐర్లాండ్‌ను 18.1 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్ చేశారు.

దీంతో ఆస్ట్రేలియా ఈ టోర్నీలో రెండో విజయం సాధించింది.

పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఐర్లాండ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది.

ఆస్ట్రేలియా తరఫున కెప్టెన్ ఆరోన్ ఫించ్ (63: 44 బంతుల్లో) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా ఫించ్‌కే లభించింది.

ఈ మ్యాచ్ విజయం సాధించినా ఆస్ట్రేలియా సెమీస్ అవకాశాలు క్లిష్టంగానే ఉన్నాయి.