టీ20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన సూపర్-12 మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది.

అనంతరం పాకిస్తాన్ 13.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

పాకిస్తాన్ బౌలర్ హరీస్ రౌఫ్ వేసిన బంతి నెదర్లాండ్ బ్యాటర్ బాస్ దీ లీడ్ ముఖానికి తగిలి రక్తం వచ్చింది.

ఈ విజయంతో సెమీస్ ఆశలను పాకిస్తాన్ సజీవంగా ఉంచుకుంది.

నెదర్లాండ్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

నెదర్లాండ్స్ బ్యాటర్లలో ఒక్కరి స్ట్రైక్ రేట్ కూడా 100ను దాటలేదు.

పాకిస్తాన్ బౌలర్లలో అత్యధిక ఎకానమీ కూడా 5.5 పరుగులు మాత్రమే.

పాకిస్తాన్ బౌలర్లలో షాదబ్ ఖాన్ అత్యధికంగా మూడు వికెట్లు తీసుకున్నాడు.

అనంతరం పాకిస్తాన్ 13.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.
(All Images Credits: ICC)