మనదేశంలో రక్తహీనత చాలా సాధారణంగా కనిపించే పోషకాహార లోపం. దీన్ని తగ్గించే కొన్ని ఆహారాల గురించి తెలుసుకుందాం.

హీమోగ్లోబిన్ ఉత్పత్తిలో ఐరన్ అత్యంత ముఖ్యమైంది. బచ్చలి, పాల కూర వంటి ఆకుకూరల్లో ఇది ఫుష్కలం.

తరచుగా ఆకుకూరలు తీసుకుంటే శరీరంలో హీమోగ్లోబిన్ పెరుగుతుంది.

ఐరన్, ఫోలేట్ తోపాటు విటమిన్ సి తో బీట్ రూట్ చక్కని పోషకాహారం.

బీట్ రూట్ ను ఆహారంలో భాగం చేసుకుంటే హీమోగ్లోబిన్ పెరుగుతుంది. రక్తప్రసరణ కూడా మెరుగవుతుంది.



బీన్స్, చిక్కుళ్లు, ఇతర లెగ్యూమ్స్ అన్నింటిలో కూడా ఐరన్ తో పాటు ప్రొటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది.



వీటిలో హీమోగ్లోబిన్ పెంచే మెగ్నీషియం, ఫోలెట్ వంటి ఇతర ఆవశ్యక వినరల్స్, పోషకాలెన్నో ఉంటాయి.



విటమిన్ సి, ఐరన్ కలిగిన దానిమ్మగింజలను క్రమం తప్పకుండా తీసుకుంటే హీయోగ్లోబిన్ తక్కువ ఉన్నవారికి మంచి ఫలితం ఉంటుంది.



సోయా పాలతో చేసిన పన్నీర్ టోఫూలో కూడా ఐరన్ మెండుగా ఉంటుంది. టోఫూతో కూడా రక్తంలో హీమోగ్లోబిన్ పెరుగుతుంది.



జీడిపప్పు, బాదం, గుమ్మడి గింజల వంటి గింజల్లో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ప్రతి రోజూ ఇవి తీసుకోవడం వల్ల రక్తంవృద్ధి కలుగుతుంది.



Images courtesy : Pexels