ఆపిల్లో ఫైబర్ ఎక్కువ కనుక ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. రక్తంలో కొలేస్ఠ్రాల్ కూడా తగ్గిస్తుంది.

నిమ్మ, బత్తాయి, సంత్రా వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ ఎక్కువ. ఇది కొలెస్ట్రాల్ ను అదుపు చేస్తుంది.

ద్రాక్ష.. రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉంచుతాయి. నష్టం చేసే కొలెస్ట్రాల్ ను లివర్ కు చేరుస్తాయి

అవకాడోలో అలోయిక్ ఆసిడ్ ఉంటుంది. ఇది బీపి తగ్గించి, నష్టపరిచే కొలెస్ట్రాల్ ను నివారిస్తుంది.

బొప్పాయిలో ఫైబర్ ఎక్కువ. ఇది బీపి అదుపులో ఉంచుతుంది. ఎల్డీఎల్ స్థాయిలను తగ్గిస్తుంది.

పైనాపిల్ లో బ్రొమోలిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ను నివారిస్తుంది. రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.

విటమిన్ ఎ,బి,సి, కె కలిగిన టమాటలు గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడమే కాదు కోలస్ట్రాల్ కూడా తగ్గిస్తాయి.

అరటిలో ఉండే పొటాషియం, ఫైబర్ రక్తపోటు తగ్గించి కొలెస్ట్రాల్ ను నివారిస్తుంది.

స్ట్రాబెర్రి, బ్లాక్ బెర్రీ వంటి బెర్రీ పండ్లు కొలెస్ట్రాల్ ఆక్సిడెషన్ ను నివారించి రక్తనాళాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి.

Images courtesy : Pexels