శృంగార తార సన్నీ లియోన్... ఆ చిత్రాలు మానేశాక, బాలీవుడ్‌కు వ‌చ్చారు. ఆ తర్వాత దక్షిణాది ప్రేక్షకులనూ ఐటమ్ పాటలతో పలకరించారు. ఇప్పుడు కొన్ని సినిమాలే చేస్తున్నారు. ఇంతకీ, సన్నీ లియోన్ సౌత్‌లో చేసిన స్పెషల్ సాంగ్స్ ఏమిటి? ఇప్పుడు చేస్తున్న సౌత్ సినిమాలు ఏమిటి? ఓ లుక్కేయండి.

స‌న్నీ లియోన్‌ను ఫ‌స్ట్ సౌత్‌కు తీసుకొచ్చిన‌ది కోలీవుడ్‌. త‌మిళ సినిమా 'వ‌డ‌క‌ర్రీ' (2014)లో ఆమె ఓ సాంగ్ చేశారు.

తెలుగుకు సన్నీ లియోన్‌ను తీసుకొచ్చినది మంచు మనోజ్. అతడి 'కరెంట్ తీగ'లో ఆమె అతిథి పాత్రలో కనిపించారు. 'సన్నీ సన్నీ' సాంగ్‌లో సంద‌డి చేశారు.

త‌మిళ‌, తెలుగు సినిమాల్లో న‌టించిన త‌ర్వాత క‌న్న‌డ సినిమా 'డీకే'లో ఓ స్పెష‌ల్ సాంగ్ చేశారు.

కన్నడలో మరో స్పెషల్ సాంగ్ 'లవ్ యు ఆలియా'లో చేశారు. 

తెలుగులో సన్నీ లియోన్ నటించిన రెండో సినిమా 'పీఎస్వీ గరుడవేగ'. రాజశేఖర్ హీరోగా నటించిన ఆ సినిమాలో ఆమె స్పెషల్ సాంగ్ చేశారు.

సన్నీ లియోన్ నటించిన తొలి మలయాళ సినిమా 'మధుర రాజా'. అందులో మమ్ముట్టి హీరో. అందులో కూడా ఆమె స్పెషల్ సాంగ్ చేశారు.

దక్షిణాదిలో ఏడు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన తర్వాత స‌న్నీ లియోన్‌కు సినిమా చేసే అవకాశం వచ్చింది. ఆమె ప్రధాన పాత్రలో 'వీరమహాదేవి' సినిమా చేస్తున్నారు.

మలయాళంలో 'రంగీలా' అనే సినిమా కూడా చేస్తున్నారు. ఆ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. అది ఇదే.

తమిళంలో 'షీరో' అనే సినిమా చేస్తున్నారు. తెలుగులోనూ ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

హిందీ, తెలుగు భాషల్లో 'కోకా కోలా' అని సినిమా ప్రకటించారు. కరోనా తర్వాత పరిస్థితులు మారాయి. ఇప్పుడు సినిమా ఉందో? లేదో? మరి!

ఇదండీ సన్నీ లియోన్ సౌత్ సినిమాల లిస్టు!