పెళ్లికాని అమ్మాయిల కోసం



శ్రీ కృష్ణుడిని భర్తగా పొందేందుకు రుక్మిణీదేవి పడిన ఆరాటం, ఆమె కోరిక నెరవేర్చిన తీరు రుక్మిణి కళ్యాణంలో అద్భుతంగా వర్ణించాడు పోతన. ఇది చదివిన యువతులకు మంచి భర్త లభిస్తాడని విశ్వాసం.



తాను వలచిన శ్రీకృష్ణుడిని రుక్మిణి ఇలా భావించింది (పోతన భాగవతంలోని ఓ పద్యం)



ప్రాణేశ! నీమంజుభాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమి యేల?
పురుషరత్నమ! నీవు భోగింపగాలేని తనులత వలని సౌందర్యమేల?
భువనమోహన! నిన్ను బొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల?



దయత! నీయధరామృతంబానగాలేని జిహ్వకు ఫలరససిద్ధి యేల?
నీరజాతనయన! నీ వనమాలికా గంధమబ్బలేని ఘ్రాణమేల?
ధన్యచరిత! నీకు దాస్యంబు సేయని జన్మమేల యెన్ని జన్మములకు?



శ్రీకృష్ణ! నీ మనోఙ్ఞమైన పలుకులు వినలేని చెవులు ఎందుకు దండగ. పురుషోత్తమ! నీవు భోగించని వంటికి అందమెందుకు దండగ. ప్రాణేశా! నిన్ను చూడలేని కళ్ళకి చూపెందుకు దండగ. ప్రభూ! నీ అధరామృతం అందని నాలుకకు రుచెందుకు దండుగ.



పద్మాక్షా! నీ మెడలోని పూలహారం వాసన చూడలేని ముక్కు ఎందుకు దండగ. మహాత్మా! కృష్ణభగవాన్! ఎన్నిజన్మలకైనా నీ సేవచేయలేని దండగైన జన్మ ఎందుకు. నాకు వద్దు.”



రుక్మిణి తన ప్రేమ రాయబారాన్ని దేవదేవుడైన శ్రీకృష్ణుని కడకు తీసుకువెళ్ళిన అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణుడు యెంతకీ తిరిగి రాకపొయేసరికి 'ఏమైనదో ఏమో'నని రుక్మిణీదేవి చింతించే సమయంలో మరో పద్యం



ఏల నాస్వామి రాడేమి కతమొ ? భూసు రేంద్రు డగ్నిద్యోతు డేగె, వృద్ధు
డాయసపడి, దుర్గమారణ్య మార్గమున్ గడచెనో? కడిచినా, కడలినధిగ
మించి ద్వారకపురమేగెనో? యేగిన మాధవు దర్శన మతనికాయె



నో ! లేదొ ! వినియేమను కొనెనో మనమున, దయచేయతలచునో, తలపడేమొ?
రుక్మిణి దేవి దేవాలయములో అమ్మవారిని ఈ విధంగా ప్రార్థిస్తుంది.
నమ్మితి నా మనంబున సనాతునులైన యుమామహేశులన్



మిమ్ము బురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ మేటి పె
ద్దమ్మ దయాంబురాశిది గదమ్మ హరింబతిసేయమ్మనిన్
నమ్మిన వారి కెన్నటికి నాశము లేదు గదమ్మ యీశ్వరీ



పెళ్లి ఆలస్యం అవుతున్న అమ్మాయిలు రుక్మిణీ కళ్యాణం చదివితే త్వరగా పెళ్లి అవుతుందనీ , లలితా దేవిని పూజించమనీ, కాత్యాయనీ వ్రతం చేయమని చెబుతారు పండితులు. Images Credit: Pinterest