తెలుగు మాసాల్లో ప్రతి నెలకూ ఓ ప్రత్యేకత ఉంది. కార్తీక మాసం దీపారాధనలకు ప్రసిద్ధి అయినట్టే మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి. ఈ నెల మొత్తంమీద మాఘ పౌర్ణమి మరింత ప్రత్యేకం
మాఘమాసంలో సూర్యోదయానికి ముందు పవిత్ర స్నానాలు చేయాలని చెబుతారు. ఈ ఏడాది మాఘపూర్ణిమ ఫిబ్రవరి 5న వచ్చింది.
బ్రహ్మ ముహూర్తంలో జలాలన్నీ బ్రహ్మహత్య, సురాపానం లాంటి మహా పాతకాలను పోగొట్టి పవిత్రులుగా చేయుటకు సంసిద్ధంగా ఉంటాయని అర్థం.
మాఘపూర్ణిమను మహామాఘి'' అని అంటారు. సంవత్సరంలో వచ్చే 12 పూర్ణిమలలోనూ మాఘ పూర్ణిమ'' అత్యంత విశేషమైనది.
మహామాఘి'' శివ, కేశవులిద్దరికీ ప్రీతికరమైనది. అందుకే ఈ మాఘ పూర్ణిమ నాడు తప్పకుండా సముద్రస్నానం చేయాలంటారు.
సకల నదీ, నదాలు చివరకు సముద్రంతోనే సంగమిస్తాయి. అందుకే సముద్రస్నానం చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది.
నదీప్రవాహ వేగానికి ఎదురుగా నడుము మునిగే వరకూ నిల్చుని కనీసం 48 నిమిషాల పాటు స్నానం చేయాలని విధి. అది కూడా సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలోనే చేయాలి.
సముద్రం, నదుల్లో స్నానమాచరించలేనివారు బావుల దగ్గరగానీ, చెరువుల వద్దగానీ గంగ, సింధు, కావేరి, కృష్ణ, గౌతమి'' నదుల పేర్లు స్మరిస్తూ స్నానం చేస్తే ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది.
ఈ మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే, మాఘమాసం చివరి మూడురోజులైనా పవిత్రస్నానాలు చేస్తే మంచి ఫలాన్ని పొందుతారని చెబుతారు Images Credit: Pinterest