11. యజ్ఞకుండం నుంచి వచ్చిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎలా పంచాడు? కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు
12. బ్రహ్మదేవుని ఆవలింత నుంచి పుట్టిన వానరుడెవరు? జాంబవంతుడు
13. వాలి ఎవరి అంశతో జన్మించాడు? దేవేంద్రుడు ( ఇంద్రుడు)
14. వాయుదేవుడి వలన జన్మించిన వానరుడెవరు? హనుమంతుడు ( ఆంజనేయుడు)
15. కౌసల్య కుమారుని పేరేంటి? శ్రీరాముడు
16. భరతుని తల్లి ? కైకేయి
17. రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేంటి? లక్ష్మణ, శత్రుఘ్నులు కవలలు- తల్లి సుమిత్ర
18. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణం చేసిన మహర్షి ఎవరు? వశిష్ఠుడు
19. విశ్వామిత్రుడు అయోధ్యకు వచ్చేసరికి రాముడి వయస్సు? 12 సంవత్సరములు