శ్రీముఖికి బుల్లితెర రాములమ్మ అని ఇమేజ్ ఉంది. అందంతో కాదు... కంటి చూపుతో కూడా కవ్వించగలదు. ఆదివారం 'స్టార్ మా పరివారం' ప్రోగ్రామ్ కోసం శ్రీముఖి ఈ విధంగా రెడీ అయ్యారు. ఈ మధ్య రాములమ్మ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి మోడ్రన్‌గా కనిపించాలని శ్రీముఖి కోరుకుంటున్నట్టు ఉన్నారు. ఆహా ఓటీటీలో వచ్చే డ్యాన్స్ రియాలిటీ షో 'డాన్స్ ఐకాన్'లో గ్లామర్ షో చేస్తున్నారు. 'స్టార్ మా పరివారం' కోసం ట్రెడిషనల్ గా రెడీ అయ్యారు. కానీ, చూపులతో కవ్వించారు. సోషల్ మీడియాలో శ్రీముఖి ఫోటోలు పోస్ట్ చేయగా... చాలా మంది లవ్ ఎమోజీలతో రిప్లై ఇచ్చారు. శ్రీముఖి వార్డ్ రోబ్ లో ఇప్పుడు ఎక్కువ మోడ్రన్ డ్రస్ లు కనిపిస్తున్నాయి. స్టైలిష్ డ్రస్ లకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. పెళ్లి కాని టీవీ సెలబ్రిటీల జాబితాలో శ్రీముఖి పేరు కూడా ఉంటుంది. ఇంకో రెండేళ్ల తర్వాత ఆమె పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారట. తనకు భర్తగా సెన్సిబుల్ పర్సన్ రావాలని వెయిట్ చేస్తున్నట్టు గతంలో ఒకసారి శ్రీముఖి పేర్కొన్నారు. (All Images Courtesy : sreemukhi / Instagram)