శ్రీముఖి అంటే ఒక ఎనర్జీ, కుర్రాళ్లు మనసు దోచే అందాల బొమ్మ. ఒకప్పుడు ‘పటాస్’తో బోలెడంత వినోదాన్ని పంచింది రాములమ్మ. ఆ తర్వాత ‘బిగ్ బాస్’లో తన లక్ పరీక్షించుకుంది. కానీ, ‘బిగ్ బాస్’లో రన్నరప్ స్థానాన్ని సరిపెట్టుకోవల్సి వచ్చింది. ‘బిగ్ బాస్’ తర్వాత పూర్తిగా ఏ షోలోనూ అవకాశాలు చిక్కలేదు. ‘కామెడీ స్టార్స్’లో కొన్నాళ్లు మాత్రమే ఉంది. ప్రస్తుతం జీ తెలుగులో ‘స రె గ మ పా’లో యాంకరింగ్ చేస్తోంది. రాములమ్మ తాజాగా జైపూర్‌లోని ఓ పెళ్లిలో సందడి చేసింది. శ్రీముఖి త్వరలో ‘ఆహా’లో ప్రసారమయ్యే డ్యాన్స్ షోలో కనిపించనుంది. ఈ సందర్భంగా శ్రీముఖి రక్కమ్మ పాటకు డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. Images Credit: Sreemukhi/Instagram