ఉల్లికాడలతో హైబీపీ, షుగర్ నియంత్రణలో... ఆకుపచ్చగా ఉండే ఉల్లికాడలను ఆకు కూరల జాబితాలోకే వేసుకోవాలి. ఉల్లిపాయల కన్నా, ఆకుకూరల కన్నా ఇవి రెండింతలు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. ఉల్లికాడలు తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. గ్యాస్, మలబద్ధకం వంటివి కలగవు. క్యాన్సర్ ను అడ్డుకునే శక్తికి కూడా ఉల్లికాడలకు ఉంది. కాబట్టి ప్రతి రెండు రోజులకోసారి ఉల్లికాడలను ఏదో ఒక ఆహారం రూపంలో తీసుకోవాలి. ఉల్లికాడలు తినడం వల్ల తక్కువ కేలరీలు, కొవ్వు శరీరంలో చేరుతాయి కాబట్టి అధిక బరువు సమస్యా కూడా లేదు. వీటిలో జియాంటాంటిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఉల్లికాడలు చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది. కాలేయం చుట్టూ పేరుకుపోయిన అదనపు కొవ్వును ఇది తగ్గిస్తుంది. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ కె వంటి విటమిన్లతో పాటూ మెగ్నిషియం, పొటాషియం, క్రోమియం, మాంగనీస్, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేసే ఆకుకూర ఉల్లికాడలు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. శక్తిని పెంచుతుంది.