నటి, నిర్మాత మంచు లక్ష్మి భలే యాక్టీవ్‌గా ఉంటారు.
లక్ష్మీ ప్రస్తుతం ఓ తమిళ సినిమాలో నటిస్తున్నారు.
తెలుగులో ‘లేచింది మహిళా లోకం’లో నటిస్తున్నారు.
ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే మొదలైంది.
లక్ష్మీ మరోవైపు సెల్ఫ్ డిఫెన్స్‌లో కూడా శిక్షణ పొందుతున్నారు.
తాజాగా మంచు లక్ష్మీ ‘కేజీఎఫ్- చాప్టర్ 2’ డైలాగ్ చెప్పారు.
‘వయొలెన్స్ లైక్స్ మీ’ అంటూ యశ్‌ను అనుకరించారు.
ఈ వీడియో చూసి.. నెటిజన్స్ ఎప్పటిలాగానే ట్రోల్ చేస్తున్నారు.
మంచు లక్ష్మీ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ డైలాగ్ వీడియో ఇదే
Images and Videos Credit: Manchu Lakshmi/Instagram