సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 523 పరుగులు నమోదయ్యాయి. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యధికం. ఈ మ్యాచ్ 16, 18, 23, 24 బంతుల్లో అర్థశతకాలు నమోదయ్యాయి. సన్‌రైజర్స్ స్కోరు (277/3) ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికం. ముంబై ఇండియన్స్ స్కోరు (246/5) ఐపీఎల్‌లో ఛేజింగ్‌లో హయ్యస్ట్. ఒకే ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు (38). టీ20 చరిత్రలో కూడా ఒక మ్యాచ్‌లో నమోదైన అత్యధిక సిక్సర్లు ఇవే. టీ20 చరిత్రలో ఒక మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు. దీన్ని ఐపీఎల్ చరిత్రలోనే క్రేజీ మ్యాచ్ అనవచ్చు.