ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చెలరేగుతున్నారు. ఈ మ్యాచ్‌లో పవర్‌ప్లే ఆరు ఓవర్లలో రైజర్స్ వికెట్ నష్టానికి 81 పరుగులు చేశారు. పవర్‌ప్లేలో సన్‌రైజర్స్‌కు ఇదే అత్యధిక స్కోరు. 2017లో కోల్‌కతాపై సన్‌రైజర్స్ పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా 79 పరుగులు చేసింది. ఇప్పటివరకు ఇదే హయ్యస్ట్. కానీ ఇప్పుడు ఈ రికార్డు కూడా బద్దలయింది. 2019లో పంజాబ్‌పై పవర్‌ప్లేలో రైజర్స్ 77 పరుగులు చేసింది. అది మూడో అత్యధిక స్కోరుగా ఉంది. 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై కూడా 77 పరుగులే చేసింది. అది రైజర్స్ పవర్‌ప్లే రికార్డుల్లో నాలుగో అత్యధిక స్కోరు.