ఐపీఎల్‌లో సంజు శామ్సన్.. ధోని, కోహ్లీల రికార్డును బద్దలుకొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజు ఈ రికార్డు బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో సంజు శామ్సన్ 46 బంతుల్లోనే 86 పరుగులు చేశాడు. సంజు అంత కష్టపడినా రాజస్తాన్ ఆ మ్యాచ్‌లో ఓటమి పాలైంది. శామ్సన్ ఈ మ్యాచ్‌లో ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్సర్లు కొట్టాడు. ఐపీఎల్‌లో ఫాస్ట్‌గా 200 సిక్సర్లు కొట్టిన ఇండియన్ బ్యాటర్‌గా సంజు నిలిచాడు. ఈ మైలురాయిని సంజు 159 ఇన్నింగ్స్‌లోనే చేరుకున్నాడు. ఎంఎస్ ధోని 165, విరాట్ కోహ్లీ 180 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయి చేరుకున్నారు.