రాంచీ టెస్టు అనంతరం జరిగిన ప్రెస్ మీట్‌లో రోహిత్ శర్మ ఫైర్ అయ్యాడు. ఆకలితో ఉంటేనే భారత జట్టులో అవకాశాలు వస్తాయని తేల్చి చెప్పాడు. ఆ ఆకలి లేనివారికి జట్టులో చోటు కల్పించడంలో అర్థం లేదన్నాడు. రోహిత్ శర్మ చేసిన కామెంట్స్ ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌ల పైనే అని తెలుస్తోంది. రోహిత్ శర్మ పేర్కొన్న ఆ ఆకలి టెస్టు క్రికెట్ ఆడటం గురించి. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ రంజీ ట్రోఫీ ఆడకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దేశవాళీ క్రికెట్ ఆడకుండా ఐపీఎల్‌కు ప్రాధ్యానత ఇస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జే షా కూడా హెచ్చరించాడు. క్రికెట్ ఫార్మాట్లలో అన్నిటికంటే కష్టమైనది టెస్టులేనని రోహిత్ అన్నాడు. ఇటువంటి ఫార్మాట్లో విజయం సాధించాలంటే ఆకలి కూడా ఉండాలని అభిప్రాయపడ్డాడు. అటువంటి వారికే అవకాశాలు దక్కుతాయని తేల్చిచెప్పాడు.