ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ కొత్త మైలురాయిని చేరుకున్నాడు. టెస్టుల్లో 500 వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ లిస్టులో అశ్విన్ కంటే ముందు అనిల్ కుంబ్లే (619) ఉన్నారు. కేవలం 98 టెస్టుల్లోనే అశ్విన్ ఈ రికార్డు అందుకోవడం విశేషం. టెస్టుల్లో అత్యంత వేగంగా ఈ రికార్డు అందుకున్న రెండో బౌలర్ అశ్విన్. ముత్తయ్య మురళీధరన్ (87) అశ్విన్ కంటే ముందున్నాడు. అశ్విన్ 500 వికెట్లు తీయడానికి 25,714 బంతులు తీసుకున్నాడు. అతి తక్కువ బంతుల్లో 500 వికెట్లు తీసిన వారిలో రెండో స్థానంలో నిలిచాడు. ఫస్ట్ ప్లేస్‌లో గ్లెన్ మెక్‌గ్రాత్ (25,528) ఉన్నారు. రవిచంద్రన్ అశ్విన్‌ను తన తల్లే స్పిన్ వేయమని ప్రోత్సహించారని ఆయన తండ్రి తెలిపారు.