1. మహేంద్ర సింగ్ ధోని - 219 మ్యాచ్‌లకు కెప్టెన్సీ - 132 విజయాలు ధోని కెప్టెన్సీలో చెన్నై ఏకంగా ఐదు టైటిళ్లు సాధించింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధికం. ముంబై కెప్టెన్ రోహిత్ ఖాతాలో కూడా ఐదు టైటిళ్లు ఉన్నాయి. 2. సురేష్ రైనా - ఆరు మ్యాచ్‌లకు కెప్టెన్సీ - రెండు విజయాలు ధోని లేనప్పుడు మాత్రమే రైనా కెప్టెన్సీ చేశాడు. ఇతర జట్ల నుంచి కెప్టెన్సీ ఆఫర్లు వచ్చినా ధోనిపై ఉన్న గౌరవంతో రైనా వాటిని తిరస్కరించాడు. ధోని, రైనాలకు తల, చిన్న తల అని నిక్ నేమ్స్ కూడా ఉన్నాయి. 3. రవీంద్ర జడేజా - ఎనిమిది మ్యాచ్‌లకు కెప్టెన్సీ - రెండు విజయాలు 2022లో జడేజా... చెన్నైకి కెప్టెన్ అయ్యాడు. కానీ ఎనిమిది మ్యాచ్‌ల తర్వాత జడేజా కెప్టెన్సీ తిరిగి ధోనికి అప్పగించేశాడు.