ఐపీఎల్‌లో 200కు పైగా పరుగులను పంజాబ్ ఆరు సార్లు ఛేదించింది. టోర్నీ చరిత్రలో ఇదే హయ్యస్ట్. ముంబై ఇండియన్స్ 200కు పైగా టార్గెట్‌ను ఐదు సార్లు ఛేజ్ చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ 200 పరుగులకు పైగా టార్గెట్‌ను మూడు సార్లు ఛేదించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ కూడా 200 ప్లస్ టార్గెట్‌ను మూడు సార్లు ఛేజ్ చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ కూడా 200 పైగా టార్గెట్‌ను రెండు సార్లు ఛేజ్ చేసింది. రాజస్తాన్ రాయల్స్ రెండు సార్లు 200 ప్లస్ టార్గెట్‌ను ఛేదించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్కసారి మాత్రమే 200 ప్లస్ టార్గెట్‌ను ఛేదించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా 200కు పైగా టార్గెట్‌ను ఒకసారి ఛేజ్ చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఒకసారి మాత్రమే 200 టార్గెట్‌ను ఫినిష్ చేసింది. గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా 200 పైగా టార్గెట్‌ను సాధించలేదు.