ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ప్లేఆఫ్స్‌కు వారు మరింత చేరువ అవుతున్నారు. సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ తొమ్మిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ బ్యాటర్లలో తిలక్ వర్మ (65: 45 బంతుల్లో) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నేహాల్ వధేరా (49: 24 బంతుల్లో) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం రాజస్తాన్ కేవలం 18.4 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని ఛేదించింది. యశస్వి జైస్వాల్ (104: 60 బంతుల్లో) శతకంతో అజేయంగా నిలిచాడు. పాయింట్ల పట్టికలో రాజస్తాన్ 14 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.