రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే దిశగా పయనిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సరికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. క్రీజులో జైస్వాల్ (14 బ్యాటింగ్), రోహిత్ (24 బ్యాటింగ్) ఉన్నారు. టీమిండియా విజయానికి ఇంకా 152 పరుగుల దూరంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించనుంది. తొలి ఇన్నింగ్స్‌లో ధ్రువ్ జురెల్ (90) పోరాటంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోరు చేసింది. దీంతో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ ముందు 192 పరుగుల లక్ష్యం నిలిచింది.