రెండో టీ20లో రెచ్చిపోయిన దక్షిణాఫ్రికా - మూడు వికెట్లతో భారత్ ఓటమి! భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం జరిగింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మూడు వికెట్లతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 19 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 128 పరుగులు సాధించింది. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా (39 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లు కూడా చాలా పొదుపుగా బౌలింగ్ చేశారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్ (47 నాటౌట్) అత్యధిక పరుగులు సాధించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు పడగొట్టాడు. ట్రిస్టన్ స్టబ్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.