బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు ఏ ప్లస్ కేటగిరీలో నలుగురు భారతీయ ఆటగాళ్లు ఉన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా ఈ కేటగిరిలో ఉన్నారు. గ్రేడ్ ఏ - అశ్విన్, షమీ, సిరాజ్, రాహుల్, గిల్, హార్దిక్ పాండ్యా గ్రేడ్ బి -సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్ గ్రేడ్ సి - రింకూ సింగ్, తిలక్ వర్మ సహా చాలా మంది ఉన్నారు. ధర్మశాల టెస్టులో ఆడితే ధ్రువ్ జురెల్ కూడా గ్రేడ్ సిలోకి ఎంటర్ అవుతాడు. యశస్వి జైస్వాల్ అద్భుత ప్రదర్శనతో గ్రేడ్ బిలోకి చేరుకున్నాడు. పేస్ బౌలర్ ముకేష్ కుమార్ కూడా గ్రేడ్ సిలోకి చేరుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్‌కు కూడా గ్రేడ్ సిలోకి చేరుకునే అవకాశం ఉంది.