2023-24 సంవత్సరానికి గానూ బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులను ప్రకటించింది. ఈ లిస్టులో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు చోటు కల్పించలేదు. వార్షిక కాంట్రాక్టుల కోసం శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లను అసలు కన్సిడర్ చేయలేదని బీసీసీఐ తెలిపింది. దీనిపై బోలెడన్ని కథనాలు వినిపిస్తున్నాయి. దక్షిణాఫ్రికా సిరీస్‌లో మధ్యలో నుంచే ఇషాన్ కిషన్ వైదొలిగాడు. ఆ తర్వాత మరే సిరీస్‌కు ఇషాన్ సెలక్ట్ అవ్వలేదు. ఇషాన్ భారత క్రికెట్ జట్టులోకి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని కోచ్ ద్రవిడ్ స్పష్టం చేశాడట. కానీ ఇషాన్ కిషన్ మాత్రం రంజీ ట్రోఫీకి దూరంగా ఉన్నాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ కూడా రంజీ ట్రోఫీ మధ్యలోనే వెనుదిరిగాడు. దీంతో వీరిద్దరికీ బీసీసీఐ వార్షిక కాంట్రాక్టుల నుంచి ఉద్వాసన పలికిందని వార్తలు వస్తున్నాయి.