ఉరుములు, మెరుపులు ఎలా వస్తాయ్?

Published by: RAMA

ఎండలో భూమి వేడెక్కినప్పుడు తేమతో కూడిన గాలి పైకి లేస్తుంది..ఇదే తుఫాను మేఘాలకు పునాది

వేడి గాలి చల్లబడి భారీ నల్లని మేఘాలుగా మారుతుంది. వీటినే తుఫాను మేఘాలు అంటారు

మేఘంలోపల మంచు క్రిస్టల్స్, నీటి బిందువులు ఒకదానికొకటి రాసుకుంటాయి. పైన +ve ఛార్జ్, కింద -ve ఛార్జ్ ఏర్పడతాయి

+ve, -ve ఛార్జ్ ల మధ్య భారీ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది..అదే మెరుపు

మెరుపు వచ్చినప్పుడు గాలి 30,000°C వరకు వేడెక్కుతుంది..ఆ వేడిగాలి విస్తరించి ధన్ అని వచ్చే శబ్ధమే ఉరుము

ముందు మెరుపు కనిపించి ఆ తర్వాత ఉరుము శబ్దం ఎందుకొస్తుంది?

శబ్దం వేగం కన్నా కాంతి వేగం ఎక్కువ..అందుకే ముందుగా మెరుపు కనిపిస్తుంది..3 సెకెన్ల తర్వాత ఉరుము వినిపిస్తుంది

ఉరుములు వచ్చినప్పుడు చెట్టు కింద నిలబడొద్దు, విద్యుత్ పరికరాలు ఆఫ్ చేయండి

ఉరుములు, మెరుపులు భయపెట్టినా అవి వాతావరణాన్ని శుభ్రపరుస్తాయి