ఆలయం ముందు ధ్వజస్తంభం ఎందుకు ఉంటుంది?

మహాదానశీలి అయిన మయూర ధ్వజుడిని పరీక్షించాలి అనుకున్నాడు శ్రీ కృష్ణుడు

ధర్మరాజుని వెంటబెట్టుకుని బ్రాహ్మణ వేషంలో మయూర ధ్వజుడి దగ్గరకు వెళ్లాడు

మిమ్మల్ని దర్శించుకునేందుకు వచ్చే మార్గంలో సింహం మా బిడ్డను అపహరించింది

మీ శరీరాన్ని , మీ భార్య బిడ్డల్ని ఇస్తే సింహం తన బిడ్డను విడిచిపెడుతుందని చెప్పాడు

అందుకు సరేనని సన్నధ్దమైన మయూర ధ్వజుడి ఎడమకంటినుంచి నీరొచ్చింది

అది గమనించిన ధర్మరాజు..ఏడుస్తూ ఇచ్చే దానం తమకు వద్దన్నాడు

తన శరీరంలో ఎడమ భాగం ఎవరికీ ఉపయోగపడదని అందుకే బాధపడుతున్నాను అంటాడు

సంతోషించిన శ్రీకృష్ణుడు..నీకు ఏ వరం కావాలో కోరుకోమన్నాడు

ఆశాశ్వతం అయిన శరీరాన్ని విడిచిపెట్టి శాశ్వతంగా భగవంతుడి సాన్నిధ్యంలో ఉండే వరం ప్రసాదించమని కోరాడు

ప్రతి ఆలయంలోనూ ధ్వజస్తంభంగా ఉంటావని...భక్తులు ముందుగా నిన్ను దర్శించుకుంటారని వరం ఇచ్చాడు

అప్పటి నుంచి ప్రతి ఆలయం ముందు ధ్వజస్తంభంగా మారాడు మయూరధ్వజుడు

Image Credit: playground.com