మీ డిక్షనరీలో ఓటమి అనే పదం ఉండకూడదంటే!

చేసే ప్రతి ప్రయత్నం గెలిచేందుకే...అయితే కొన్నిసార్లు ఓటమి తప్పదు

ఓడినప్పుడు బాధపడడం కన్నా అందుకు కారణాలేంటో ఆలోచించాలి

అసలు ఓటమి అనేదే ఉండకూడదంటే ఈ 4 లక్షణాలు మీలో ఉండాలని చెప్పాడు వాల్మీకి మహర్షి

ధృతిః
అంటే ధైర్యం..ధైర్యంలేనివారు ఏపనీ పూర్తిచేయలేరు

దృష్టిః
అంటే ముందుచూపు...చేసే ప్రతిపనిలో ముందుచూపు ఉండాలి

మతిః
అంటే ఏపని చేయాలి ఏ పని చేయకూడదో ఆలోచించగలిగే బుద్ధి ఉండాలి

దాక్ష్యంః
అంటే దక్షత , కరుణ , పట్టుదల, శక్తి సామర్ధ్యాలు..ఇవి ప్రతి ఒక్కరిలో ఉండాలి

నాలుగు లక్షణాలున్నవాడు ప్రపంచంలో ఏ పనిలోనూ ఓడిపోడు

Image Credit: Pixabay