రోహిణి కార్తెలో రోళ్ళు పగులుతాయని అంటుంటారు. వేసవిలో, కార్తెలో ఎండలు మరీ ఎక్కువ. వేసవి కాలంలో చివరి కార్తె అయిన రోహిణిలో ఎండలు ఎందుకు ఎక్కువగా ఉంటాయో తెలుసా? ఈ ఏడాది రోహిణి కార్తె మే 25వ తేదీ శనివారం నుంచి 8 జూన్ వరకు ఉంటుంది. 15రోజులు రోహిణి కార్తె ఉంటుంది. రోహిణి కార్తే అంటే సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించడం సూచిస్తుంది. రోహిణి కార్తెతో వేసవికాలం ముగుస్తుంది. రోహిణి కాలం తర్వాత వర్షాకాలం ప్రారంభం అవుతుంది. వ్యవసాయంపై ఆధారపడ్డ రైతులు ఏరువాకను ప్రారంభిస్తారు. రోహిణికార్తెలోని 15 రోజులు అధిక వేడి గాలులు, ఎండ తీవ్రత, అగ్ని ప్రమాదాలు, ఉక్కపోతలు ఉంటాయి. రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు కొడుతుంటాయని పెద్దలు చెబుతుంటారు. మే నెలలో 26,27,28 జూన్ నెలల్ 6,8 తేదీల్లో వర్షాలు పడుతుంటాయి.