పితృ పక్షం ఎందుకంత ముఖ్యం!
భాద్రపద మాసంలో మొదటి 15 రోజులు దేవతా పూజకు అత్యంత విశిష్టమైనవి
భాద్రపదమాసంలో పౌర్ణమి తర్వాత రోజు నుంచి అమావాస్య వరకూ వచ్చేవి పితృదేవతల ఆరాధనకు ఉత్తమం
ఈ 15 రోజులను పితృపక్షం అంటారు... 2024 లో సెప్టెంబరు 18 నుంచి అక్టోబరు 02 వరకూ పితృ పక్షం
మరణించిన పితృదేవతల ఆత్మకు శాంతి కలిగి..వారికి మోక్షం ప్రాప్తించాలంటే వారి కర్మలు పూర్తికావాలి
ఆ కర్మలు పూర్తిగా అనుభవించాలంటే మళ్లీ దేహధారణ చేసి రావాల్సి ఉంటుంది.. అందుకోసమే తర్పణాలు, పిండ ప్రదానాలు
రక్తం పంచుకుని పుట్టిన పుత్రుడు అందించిన అన్నాన్ని అనుసరించి పురుషుడి దేహంలోకి శుక్లకణంగా ప్రవేశించి స్త్రీ గర్భంలో శిశువుగా రూపాంతరం చెంది భూమ్మీదకు వస్తారు
పితృ దేవతల రుణం తీర్చుకోవడం పుత్రుల ధర్మం..అప్పుడే వారికి మోక్షం కలుగుతుంది.అందుకోసం ఈ 15 రోజులు అత్యంత ముఖ్యమైనవి
2 వారాలు తర్పణాలు, శ్రాద్ధ విధులు నిర్వర్తిస్తారు..నిత్యం కుదరని వారు ఆఖరి రోజు అయిన మహాలయ అమావాస్య రోజు తర్పణాలు విడుస్తారు
పితృదేవతల ఆశీర్వచనం ఉంటే వంశం వృద్ధి చెందుతుంది..ఆ కుటుంబానికి అంతా మంచే జరుగుతుంది...