సంవత్సరంలో అత్యంత గొప్ప ఏకాదశి ఏది?

Published by: RAMA

ఏడాదికి 24 ఏకాదశిలు ఉంటాయి...నెలకు 2 ఏకాదశిలు వస్తాయి

ప్రతి ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది

జ్యేష్ఠమాసంలో వచ్చే నిర్జల ఏకాదశిని అతిపెద్ద ఏకాదశిగా పరిగణిస్తారు

నిర్జల ఏకాదశి రోజు పాటించే ఉపవాసం...మొత్తం 24 ఏకాదశిలు ఉపవాస ఫలితాన్నిస్తుందని విశ్వాసం

ఏ ఏకాదశి అయినా ఉపవాసం, దాన ధర్మాలు అత్యంత ముఖ్యం

ఆషాఢమాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా..విష్ణువు యోగనిద్రలోకి వెళ్లే రోజుగా పరిగణిస్తారు

కార్తీకమాసంలో వచ్చే ఏకాదశితో చాతుర్మాస దీక్ష పూర్తవుతుంది

ఏకాదశి ఉపవాసం కేవలం భక్తి మాత్రమే కాదు..ఆరోగ్యం కూడా

ప్రతి 15 రోజులకు ఓసారి ఉపవాసం చేస్తే.. శరీరంలో మలినాలు తొలగిపోతాయి

దశమి రోజు రాత్రి నుంచి నియమాలు పాటించాలి..ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఆచరించి..ద్వాదశి ఘడియల్లో విరమించాలి