ఈ రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి?
కార్తీక పూర్ణిమనే దేవ దీపావళి అంటారు..ఈ రోజు వెలిగించే దీపానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది
దీపావళి పండుగలాగే ఈ రోజు కూడా ఇంటి ఆవరణ మొత్తం దీపాలు వెలిగిస్తారు
సాధారణంగా కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తుల దీపాన్ని వెలిగిస్తారు
365 వత్తులతో పాటూ... శాస్త్రాల ప్రకారం కార్తీక పూర్ణిమ నాడు బేసి సంఖ్యలో దీపాలు వెలిగించాలి.
కార్తీక పూర్ణిమ నాడు 5, 7, 11, 21, 51 లేదా 101 దీపాలు వెలిగించవచ్చు.
ఇంటి పెరట్లో, ప్రధాన ద్వారం దగ్గర, తులసి చెట్టు దగ్గర , పూజా గృహంలో దీపం తప్పకుండా వెలిగించండి.
మీరు శ్రద్ధానుసారం నెయ్యి లేదా ఆవాల నూనెను దీపానికి వినియోగించవచ్చు