కోళ్లు సూర్యోదయానికి ముందే ఎందుకు కూస్తాయి?

జీవ గడియారం రహస్యం!

Published by: RAMA

కోడి కూసింది లే ఇక అనే మాట ఊర్లలో వినిపించేది

మహానగరాల్లో కోడికూతలు బదులు అలారాలు వచ్చాయ్

అసలు సూర్యోదయం, కోడికూతతో సంబంధం లేనంత బిజీగా నగరవాసుల జీవితాలు సాగిపోతున్నాయ్

పల్లెటూర్లలో కోడికూతతోనే నిద్రలేచేవారు

ప్రత్యేకంగా టైమ్ చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యేవారు

సరిగ్గా సూర్యోదయానికి ముందే కోడి ఎలా కూస్తుంది? దానికి సమయం ఎలా తెలుస్తుంది?

కోడిలో జీవ గడియారం వల్ల ఇది జరుగుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు

మనిషి కన్నా 45 నిముషాల ముందే కోళ్లు వెలుగు చూడగలవట..అందుకే

వెలుగు వస్తోందనే సంకేతాన్నిస్తూ కోడి కొక్కొరొకో అని కూస్తుంది